గోదావరి కాలువపై వంతెనను ప్రారంభించిన హోం మంత్రి చినరాజప్ప

UPDATED 12th FEBRUARY 2018 MONDAY 9:30 PM

సామర్లకోట: తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట పట్టణంలోని పంచారామ క్షేత్రం శ్రీ చాళుక్య కుమారరామ భీమేశ్వరస్వామి దేవస్థానంలో మహా శివరాత్రి మహోత్సవములను పురస్కరించుకుని రాష్ట్ర హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప సోమవారం గోదావరి కాలువపై ఇనుప వంతెనను ప్రారంభించారు.  అలాగే క్యూ లైన్ ని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా ప్రారంభించారు. దేవస్థానం ఈవో పులి నారాయణమూర్తి,  ట్రస్ట్ బోర్డు చైర్మన్ కంటే జగదీష్ మోహన్ అధ్వర్యంలో ఏలూరుకు చెందిన సాల్వెంట్ ఆయిల్ కంపెనీ రూ. నాలుగు లక్షలు విరాళం అందించడంతో స్థానిక నిర్మాణ సంస్థల సాంకేతిక సహకారంతో ఈ వంతెన నిర్మాణాన్ని చేపట్టారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. అలాగే వారికి స్వామివారి ప్రసాదాలను అందచేశారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ ఆనంద్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు నామన రాంబాబు, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ అడబాల కుమారస్వామి, పెద్దాపురం మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు,  ప్రముఖ పారిశ్రామికవేత్తలు మట్టే శ్రీనివాస్, పసల పద్మరాఘవరావు, అంబటి ఆయుష్ అధినేతలు సింగవరపు శ్రీనివాస్, కుర్రా నారాయణస్వామి, పాలకుర్తి శ్రీనుబాబు, సభ్యులు పడాల వీరబాబు, బడితమాని త్రిమూర్తులు, తదితరులు పాల్గొన్నారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us