Film Tickets Issue : చిరంజీవి, జగన్ కలయిక పర్సనల్ – మంచు విష్ణు

UPDATED 7th FEBRUARY 2022 MONDAY 10:30 PM

Actor Manchu Vishnu : సినిమా టికెట్ల విషయం..ఇతరత్రా సమస్యలపై మెగాస్టార్ చిరంజీవి సిని పెద్దలతో మంగళవారం భేటీ కానున్నారు. ఇటీవలే సీఎం జగన్ తో జరిగిన భేటీలో వచ్చిన అంశాలను వారికి వివరించనున్నారు. ఈ క్రమంలో సినీ నటుడు మంచు విష్ణు పలు వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. చిరంజీవి, జగన్ కలయిక పర్సనల్ అంటూ పేర్కొనడం గమనార్హం. దానిని అసోసియేషన్ మీటింగ్ గా భావించకూడదని సూచించారు. సినిమా టికెట్లపై తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్ణయం తీసుకుంటుందని, వ్యక్తిగతంగా తన నిర్ణయంతో పని లేదన్నారు.

ఎవరూ నా అభిప్రాయం అడగడం లేదని, సినిమా టిక్కెట్స్ పై వైఎస్సార్ హయాంలోనే ఓ జీవో వచ్చింది… దానిపై కూడా చర్చ జరగాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. సినిమా టిక్కెట్ల ధరలు తెలంగాణలో పెంచారు… ఏపీలో తగ్గించారు.. కానీ రెండు చోట్లా కోర్టుకు వెళ్లారన్నారు. దీనిపై సినీ పరిశ్రమ ఏకత్రాటి పైకి రావాలని కోరారు. టికెట్ల ధరల వివాదంపై తెలుగు ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్ణయం మేరకు ముందుకు వెళదాము.. ఒకరిద్దరు మాట్లాడి దీనిపై వివాదం చేయడం సరికాదని హితవు పలికారు. రెండు ప్రభుత్వాలుతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తాము… తాను విడిగా మాట్లాడి సమస్య పక్కదారి పట్టించలేనన్నారు.

రెండు ప్రభుత్వాలు సినిమా ఇండస్ట్రీని ఎంకరేజ్ చేస్తున్నాయని.. చర్చలు జరుగుతున్నట్లు తెలిపారు. కలిసి మెలసి ఓ నిర్ణయం తీసుకుంటామనే విషయాన్ని చెప్పారు. టిక్కెట్స్ ధరపై ఏర్పాటైన సబ్ కమిటీని ఛాంబర్ ఆఫ్ కామర్స్ కలిసిందని, అడిగితే తాము కూడా కలుస్తామన్నారు. మోహన్ బాబు యూనివర్సిటీ ఈ సంవత్సరంలో ప్రారంభమవుతున్నట్లు, ఇందులో సినీ అకాడమీ కూడా ఉంటుందన్నారు. సినిమాకు సంబంధించిన అన్ని రంగాలలో ఇక్కడ శిక్షణ ఉంటుందన్నారు. తనపై వస్తున్న విమర్శలపై రెస్పాండ్ అయ్యారు. తనను విమర్శిస్తున్నారు అంటే నేను పాపులర్ అని అర్ధమని అన్నారు మంచు విష్ణు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us