ప్రగతిలో ఘనంగా క్రీడాదినోత్సవ వేడుకలు

UPDATED 11th JANUARY 2018 THURSDAY 5:30 PM

గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ప్రగతి ఇంజనీరింగ్ కళాశాలలో గురువారం క్రీడా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా కళాశాల చైర్మన్ డాక్టర్ పరుచూరి కృష్ణారావు హాజరైనారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు తమలోని క్రీడలు, లలితకళా నైపుణ్యాలను ప్రదర్శించే వేదికగా ఈ క్రీడాదినోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నామని, విద్యార్థులు విద్యతో పాటు వివిధ క్రీడా, సాంస్కృతిక అంశాలలో తమ ప్రతిభ చూపే విధంగా తమ కళాశాల నిరంతరం కృషి చేస్తుందన్నారు. ఇటువంటి కార్యక్రమాలలో పాల్గొనడం వల్ల విద్యార్థుల్లో క్రమశిక్షణ, జవాబుదారీతనం పెంపొందుతాయన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. శంభూప్రసాద్ మాట్లాడుతూ క్రీడాస్ఫూర్తిని పెంపొందించే విధంగా విద్యార్థులకు వాలీబాల్, క్రికెట్, కబడ్డీ, ఖో-ఖో, బాస్కెట్ బాల్, విద్యార్థినులకు ఖో-ఖో, త్రో బాల్, టెన్నికోయిట్, కళాశాల సిబ్బందికి క్రికెట్, క్యారమ్స్, చెస్, టేబుల్ టెన్నిస్ పోటీలతో పాటు ఇండోర్, అథ్లెటిక్స్, ముగ్గులు పోటీలు నిర్వహించామన్నారు. అనంతరం విజేతలకు  బహుమతులు అందచేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ మేనేజ్మంట్ ఎం.వి.హరనాధబాబు, డైరెక్టర్ డాక్టర్ జి.రఘురాం, వైస్ ప్రెసిడెంట్ ఎం.సతీష్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కె.సత్యనారాయణ, డాక్టర్ జి. నరేష్, డీన్ అడ్మినిస్ట్రేషన్, అసోసియేట్ ప్రొఫెసర్, స్పోర్ట్స్ ఇంచార్జ్ కె. రఘురాం, ఫిజికల్ డైరెక్టర్లు బి.ఆదినారాయణ, కె. లక్ష్మి దేవి, షేక్ లాల్ అహ్మద్, కె. హరిబాబుచౌదరి, జి.దుర్గా ప్రసాద్, వివిధ విభాగాధిపతులు, అధ్యాపకులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.      

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us