గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి

UPDATED 5th JULY 2017 WEDNESDAY 6:00 PM

సామర్లకోట: గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా   సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామంలో బుధవారం  రూ.89.10 లక్షల విలువ గల పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. దీనిలో భాగంగా పాఠశాల స్కూల్ అదనపు గదులు రూ.11.60 లక్షలు, రూ.77.50 లక్షలు ఎస్ సి సబ్ ప్లాన్ నిధులతో సీసీ రోడ్లు, డ్రయిన్లకు మంత్రి శంకుస్థాపన చేశారు. అలాగే పాఠశాల ఆవరణలో వనం-మనం కార్యక్రమాల్లో భాగంగా మంత్రి మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతీ గ్రామానికి కావాల్సిన వసతులను కల్పించడం టీడీపీ ప్రభుత్వ లక్ష్యం అన్నారు. అనంతరం ఇటీవల ఆపరేషన్లు వికటించి కంటి చూపు కోల్పోయిన బాధితులను పరామర్శించారు. రెండో కంటికి ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండేందుకు బాధితులకు మెరుగైన వైద్య చికిత్స అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఘటన పై పూర్తిస్థాయిలో విచారణకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వల్లూరి శేషవేణి శ్రీనివాస్, జడ్పీటీసీ గుమ్మళ్ల విజయలక్ష్మి రామకృష్ణ, ఏఎంసీ చైర్మన్ పాలకుర్తి శ్రీనుబాబు, ఎంపీపీ గోడతా మార్త, వైస్ ఎంపీపీ ఆకునూరి సత్తిబాబు, పంచాయతీ రాజ్ డీఈ హరినాధరావు తదితరులు పాల్గొన్నారు. 
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us