Updated 9th December 2022 Friday 6:25 pm
Pawan Kalyan: జనసేన ఎన్నికల ప్రచార రథం ‘వారాహి’ రంగుపై వైసీపీ చేస్తున్న విమర్శలకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ గట్టి కౌంటర్ ఇస్తున్నారు. ట్విట్టర్లో వైసీపీ తీరుపై విమర్శలు చేస్తున్నారు. గ్రీనరీ పార్క్ ఫొటో ట్వీట్ చేసిన పవన్ కల్యాణ్.. వైసీపీకి ఆ ఫొటోలోని ఏ గ్రీన్ రంగు ఇష్టమో చెప్పాలన్నారు. రూల్స్ పవన్ కల్యాణ్‌కు మాత్రమేనా అంటూ మరో ట్వీట్ చేశారు.
అసూయతో వైసీపీ వెన్నెముక కుళ్లిపోతుందంటూ అర్థం వచ్చేలా మరో ట్వీట్ చేశారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ నుంచి ఇటీవల వెళ్లిపోయిన కంపెనీల గురించి ప్రస్తావించారు. కారు టు కట్ డ్రాయర్ అంటూ ఈ అంశంపై ట్వీట్ చేశారు. ‘‘వైసీపీ టిక్కట్ రేట్‌లు, కారు రంగులు, కూల్చడాలు లాంటి చిల్లర పనులు ఆపి ఏపీ అభివృద్ధి మీద దృష్టి పెట్టాలి. ఇప్పటికే ఏపీలో వీరి లంచాలు, వాటాలు వేధింపుల వలన ‘కారు నుంచి కట్ డ్రాయర్ కంపెనీల’ దాకా పక్క రాష్ట్రానికి తరలిపోయాయ్’’ అటూ పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు.
రెండు రోజుల క్రితం పవన్ కల్యాణ్ తన వారాహి రథం గురించి వెల్లడించారు. ఇది ఆలివ్ గ్రీన్ కలర్‌లో ఉండటంతో దీనిపై వైసీపీ నేతలు పేర్ని నానితోపాటు పలువురు విమర్శలు చేశారు. దీంతో వరుస ట్వీట్లతో పవన్ కల్యాణ్ వారికి గట్టి కౌంటర్ ఇస్తున్నారు.







