Panama papers: ఐశ్వర్యరాయ్‌ను 5గంటల పాటువిచారించిన ఈడీ

ఢిల్లీ (రెడ్ బీ న్యూస్) 20 డిసెంబర్ 2021: ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పనామా పేపర్ల వ్యవహారంపై బాలీవుడ్‌ నటి ఐశ్వర్యరాయ్‌ బచ్చన్‌ ఈడీ విచారణ ముగిసింది. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు ఆమెను దాదాపు ఐదు గంటల పాటు విచారించారు. దీంతో కొద్దిసేపటి క్రితమే ఆమె ఈడీ కార్యాలయం నుంచి బయటకు వచ్చారు. పనామా పేపర్లతో ఉన్న సంబంధంపై ప్రధానంగా ఆరా తీసినట్టు సమాచారం. ఫారెక్స్‌ నిబంధనలు ఉల్లంఘించారన్న ఆరోపణలపై ఐశ్వర్యను విచారించిన అధికారులు.. ఆమె వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. ఫెమా నిబంధనల్ని ఉల్లంఘించి విదేశాల్లో డబ్బు దాచుకున్నట్టు ఐశ్వర్య ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే, తదుపరి విచారణకు రావాలని పిలిచారా లేదా అనే అంశంపై మాత్రం స్పష్టతలేదు. గతంలో కూడా రెండు సార్లు ఐశ్వర్యరాయ్‌కి ఈడీ సమన్లు పంపినప్పటికీ ఆమె వాయిదా కోరారు. దీంతో మరోసారి సమన్లు పంపడంతో ఆమె దిల్లీలోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. గత 15 ఏళ్లలో విదేశాల నుంచి అందుకున్న చెల్లింపులకు సంబంధించిన రికార్డులను ఐశ్వర్య రాయ్‌ సమర్పించినట్టు సమాచారం.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us