హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్) 15 డిసెంబర్ 2021: తన ప్రవర్తనపై కామెంట్ చేసిన ఓ నెటిజన్‌కు నటి రష్మిక స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ‘‘జీవితంలో నువ్వు ఏం సాధించావ్?’’ అని ప్రశ్నించారు. ప్రస్తుతం రష్మిక ‘పుష్ప’ ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ‘‘సామీ సామీ సాంగ్ కోసం నేనెంతో కష్టపడి పనిచేశా. అది చూశాక అందరూ నన్ను ప్రశంసిస్తే చాలు. నేను దర్శకుల నటిని. వాళ్లు ఏం చెబితే అదే నేను చేస్తా’’ అంటూ రష్మిక మాట్లాడుతున్న వీడియోను ఓ ఎంటర్‌టైన్‌మెంట్ పోర్టల్ సోషల్‌మీడియాలో షేర్ చేసింది. దానిపై ఓ నెటిజన్ స్పందిస్తూ.. ‘‘అసలు ఈమెను హీరోయిన్‌గా తీసుకోకుండా ఉండాల్సింది. ఈమె ఓవరాక్షన్ చూడలేకపోతున్నాం’’ అని రిప్లై ఇచ్చాడు. కాగా, దీనిపై రష్మిక స్పందిస్తూ.. ‘‘యాక్టింగో, ఓవరాక్టింగో.. నేను జీవితంలో ఏదో ఒకటి సాధించాను. నువ్వు ఏం సాధించావు నాన్నా’’ అంటూ దీటుగా బదులిచ్చారు. మరో రెండు రోజుల్లో ‘పుష్ప’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో అల్లు అర్జున్‌కు జంటగా ఆమె శ్రీవల్లి పాత్రలో నటించారు.







