విలువలుతో కూడిన విద్యను అందించడమే ఆదిత్య లక్ష్యం

UPDATED 14th JUNE 2017 WENESDAY 4:30 PM

గండేపల్లి: అత్యుత్తమ విలువలతో కూడిన విద్యను అందించడమే ఆదిత్య విద్యా సంస్థల లక్ష్యమని సంస్థ చైర్మన్ నల్లమిల్లి శేషారెడ్డి అన్నారు. తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థుల తల్లిదండ్రులతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని బుధవారం మాట్లాడారు. ఇప్పటి వరకు విద్యను అభ్యసించిన విద్యా విధానానికి ఈ ఇంజనీరింగ్ విద్యకు ఎంతో వ్యత్యాసం ఉందని. విద్యార్థులు మీ  భవిష్యత్తుకు మీరే విధాతలని, కష్టించి నేర్చుకున్నదానిపైనే జీవితం ఆధారపడి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. నాలుగు సంవత్సరాల సమయం మీ జీవితాలకు పూలబాట వేసేలా మలుచుకోవాలని విద్యార్థులకు సూచించారు. క్రమశిక్షణకు మారు పేరైన ఆదిత్య విద్యాసంస్థలలో విద్యార్థులను చేర్పించడంతో తల్లిదండ్రుల పాత్ర పూర్తి కాదని యాజమాన్యంతో సహకరించి విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసే విధంగా తల్లిదండ్రులు ప్రోత్సాహం ఎంతో అవసరం అన్నారు. అనంతరం సంస్థ కార్యదర్శి నల్లమిల్లి కృష్ణ దీపక్ రెడ్డి మాట్లాడుతూ అత్యుత్తమ విద్యాబోధన, సాంకేతిక నైపుణ్యంతో కూడిన ఇంజినీర్లను  దేశానికి అందించడమే ఆదిత్య విద్యా సంస్థల లక్ష్యమని పేర్కొన్నారు. మెరుగైన ఫలితాలు సాధిస్తూ ఇంజనీరింగ్ రంగంలో దూసుకు పోతున్న ఆదిత్యలో చేరే విద్యార్థులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. అలాగే విద్యార్థులు క్రమం తప్పకుండా తరగతులకు హాజరుకావడం అధ్యాపకులు భోదించే విషయాలను ఆకళింపు చేసుకోవడం ఎప్పటికప్పుడు విద్యార్థులు తమ సందేహాలను నివృత్తి  చేసుకుంటూ ముందుకు సాగాలని సూచించారు. అలాగే కళాశాల ప్రిన్సిపాల్స్ డాక్టర్ టి.కె. రామకృష్ణారావు, ప్రొఫెసర్ ఆదిరెడ్డి రమేష్ మాట్లాడుతూ సెమిస్టరు,  ఇంజనీరింగ్ విద్యావిధానం, హాజరు మొదలైన విషయాలను విద్యార్థుల తల్లిదండ్రులకు ఎప్పటికప్పుడు తెలియచేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.       

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us