ప్రభుత్వ విధానాలను స్వాగతిద్దాం: కేబుల్ అపరేటర్ల సంఘం నియోజకవర్గ సమావేశంలో అడపా

జగ్గంపేట, 31 అక్టోబరు 2020 (రెడ్ బీ న్యూస్): ఏపీ ఫైబర్ రంగంలో ప్రభుత్వం చేస్తున్న మార్పులపై ఆపరేటర్లు ఆందోళన చెందవద్దని రాష్ట్ర మల్టీ సర్వీసెస్ కేబుల్ ఆపరేటర్ల సంక్షేమ సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు అడపా వెంకట్రావు తెలిపారు. మండలంలోని జె.కొత్తూరు శివారు కనక దుర్గమ్మ ఆలయం వద్ద నియోజకవర్గ స్థాయి కేబుల్ ఆపరేటర్ల సమావేశం శనివారం జరిగింది. జగ్గంపేట మండల కన్వీనర్ రాయుడు సూర్యప్రకాశరావు అధ్యక్షతన జరిగిన ఈసమావేశానికి ముఖ్య అతిథులుగా అడపా వెంకట్రావు, జిల్లా ఉపాధ్యక్షులు ఏ.చలపతిరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల ఏపీ ఫైబర్ ఎం.ఎస్.ఓ గా నూతన వ్యక్తిని రంగంలోకి దింపడంపై ఆపరేటర్లు ఆందోళన చెందవద్దు అన్నారు. జిల్లాలో జగ్గంపేట నియోజకవర్గంతో పాటు, ధవళేశ్వరం ఏరియాలో జరుగుతున్న విధానాలపై మన జిల్లా అధ్యక్షులు కె.ఆర్ కృష్ణారెడ్డి ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మల్టీ సర్వీసెస్ కేబుల్ ఆపరేటర్ సంక్షేమ సంఘానికి నివేదిక ఇచ్చామన్నారు. దీనిపై స్పందించిన రాష్ట్ర యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పి.గౌతమ్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు ఎస్.వెంకట్రావు, వర్కింగ్ ప్రెసిడెంట్ కృష్ణారెడ్డి, ఇతర రాష్ట్ర కార్యవర్గం నాలుగు రోజుల క్రితం భవిష్యత్ కార్యాచరణపై సమాలోచన చేశారన్నారు. ఈమేరకు రాష్ట్ర సంఘం గౌరవ ఐటీ శాఖామాత్యులు గౌతమ్ రెడ్డి, ఏపీ ఫైబర్ ఎండీ మధుసూధన రెడ్డిని కలవడం జరిగింది అని అన్నారు. వారితో పలు సమస్యలపై రాష్ట్ర యూనియన్ వివరించడం జరిగిందన్నారు. ఈ మేరకు ఏపీ ఫైబర్ నెట్ ఎండీ మధుసూధన రెడ్డి ఫైబర్ నెట్ అభివృద్ధికి చేస్తున్న నిర్ణయాలను వివరించడం జరిగింది అన్నారు. అపోహలు విడిచి ఫైబర్ నెట్ అభివృద్ధికి ప్రభుత్వం చేస్తున్న నిర్ణయాలకు కట్టుబడి పని చేయాల్సిందిగా కోరారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన నూతన ఎంఎస్ఓ వ్యవస్థకు మద్దతు తెలపాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే ఎండీ సూచన మేరకు ఎవరి బాధ్యతలను వారు నిర్వహిస్తే సమస్యలు ఉండవు అన్నారు. ఏపీ ఫైబర్ నెట్ లో నిర్వహణ భారం అధికంగా ఉందని, ఆదాయం పెంచడానికి ప్రతి ఆపరేటర్ బాధ్యత వహించాల్సిన అవసరం ఉందన్నారు. ఎండీ ఇంతవరకు ఏపీ ఫైబర్ వేసిన ఆపరేటర్ల ఏరియాలో కొత్తగా ఏర్పాటు చేసిన ఎమ్ఎస్వోలకు సంబంధం ఉండదని స్పష్టం చేశారన్నారు. ఎంఎస్ఓ వల్ల ఇప్పటివరకు ఏపీ ఫైబర్ నడుపుతున్న పాత ఆపరేటర్లకు ఇబ్బంది ఉండదని ఎండీ స్పష్టం చేసినట్లు తెలిపారు. భవిష్యత్తులో ప్రతి ఆపరేటరు తమ జీవనాధారమైన ఫైబర్ నెట్ మనుగడకు ప్రభుత్వ సూచనలతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఇప్పటివరకు ఫైబర్ నెట్ నడుపుతున్న ఆపరేటర్లు ఏపీ ఫైబర్ సంస్థ ద్వారా తమకు ఇంకా కావలసిన ఓ.ఎల్.టిలు, పానులు, సెట్ టాప్ బాక్స్ లు ఏర్పాటు గురించి కోరడం జరిగిందన్నారు. అలాగే పలు గ్రామాల ఆపరేటర్లు సిగ్నల్ కోసం, సమావేశం ద్వారా రాష్ట్ర నాయకులను కోరడం జరిగిందన్నారు. నియోజకవర్గంలోని జగ్గంపేట తో పాటు కిర్లంపూడి, గండేపల్లి, గోకవరం మండల కన్వీనర్లు ద్వారా పలు గ్రామాల ఆపరేటర్లు వారి సమస్యలను తెలపడం జరిగిందన్నారు. నియోజకవర్గ పరిధిలో ప్రతి ఆపరేటర్ ప్రభుత్వ సూచనల మేరకు ఏపీ ఫైబర్ ప్రజలకు అందించడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో కిర్లంపూడి మండల కన్వీనర్ ఎం.శ్రీనివాస్, గోకవరం మండల కన్వీనర్ రవిబాబు, గండేపల్లి మండల కన్వీనర్ ఎం.మాణిక్యాలరావు ఆయా మండలాల పరిధిలో ఆపరేటర్లు పాల్గొన్నారు.
ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us