UPDATED 25th JULY 2018 WEDNESDAY 9:00 PM
సామర్లకోట: ప్రసిద్ధ పంచారామ క్షేత్రం శ్రీ కుమారరామ భీమేశ్వరస్వామి ఆలయంలో హుండీల లెక్కింపు బుధవారం నిర్వహించారు. ఐదు నెలల కాలానికి రూ.7,09921 ఆదాయం వచ్చినట్లు దేవస్థానం కార్యనిర్వహణాధికారి పులి నారాయణమూర్తి తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ కంటే జగదీష్ మోహన్, సభ్యులు పడాల వీరబాబు, దూది రాజు, మహంకాళి వెంకట గణేష్, తదితరులు పాల్గొన్నారు.







