గైట్ ఎన్ఎస్ఎస్ విద్యార్థులు రక్తదానం

UPDATED 13th APRIL 2018 FRIDAY 6:00 PM

రాజానగరం: తూర్పుగోదావరి జిల్లా రాజానగరం గోదావరి ఇనిస్టిట్యూట్ అఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ(గైట్) అటానమస్ కళాశాలకు చెందిన పది మంది ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు రక్తదానం చేసినట్లు కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ ఎం.వి. సుబ్బారావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన శుక్రవారం మాట్లాడుతూ రాజమహేంద్రవరంలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ 124వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా వారి ఆహ్వానం మేరకు తమ కళాశాల ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు రక్తదానం చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ అధికారులతో పాటు కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ కె. బాబులు పాల్గొన్నారు.       

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us