Galla Ashok: ప్రిన్స్ మహేష్ మేనల్లుడు ‘హీరో’ ఓటీటీ రిలీజ్.. డేట్ ఫిక్స్

UPDATED 4 FEBRUARY 2022  FRIDAY 06:00 AM

Galla Ashok : సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు మేనల్లుడు, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ తనయుడు గల్లా అశోక్ హీరోగా ఇటీవల సంక్రాంతికి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ‘హీరో’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యాడు. ఇందులో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ సినిమాని అమరరాజ మీడియా బ్యానర్‌పై గల్లా పద్మావతి నిర్మించారు. ‘హీరో’ సినిమా ఇటీవల సంక్రాంతి కానుకగా జనవరి 15న థియేటర్లలో విడుదల అయింది. థియేటర్స్ వద్ద ఈ సినిమా యావరేజ్ గా నిలిచింది.

తాజాగా ‘హీరో’ సినిమాని ఓటీటీలో విడుదల చేసేందుకు రెడీ అయ్యారు. ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ హాట్‌స్టార్‌ ‘హీరో’ సినిమా డిజిటల్ హక్కులను కొనుగోలు చేసింది. ఈనెల 11న ఈ సినిమాను డిస్నీ హాట్‌స్టార్‌ లో విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించారు. ఈ మేరకు అధికారికంగా తమ సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేశారు. మరి ఓటీటీ ప్రేక్షకులని ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us