UPDATED 6th FEBRUARY 2022 SUNDAY 07:45 PM
అనంతపురం (రెడ్ బీ న్యూస్): పెళ్లి వేడుకకు వెళ్లి వస్తుండగా విషాదం నెలకొంది. రోడ్డు ప్రమాదంలో ఒకే ఫ్యామిలీకి చెందిన 8 మంది మృతి చెందారు. అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉరవకొండ మండలం భూదగవి వద్ద కారును లారీ ఢీకొట్టింది.
పెళ్లి వేడుకకు హాజరై కారులో బళ్లారి నుంచి అనంతపురంకు వస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన 8 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు ఉరవకొండ మండలం నిమ్మగల్లు వాసులుగా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.







