UPDATED 6th OCTOBER 2017 FRIDAY 6:00 PM
గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ప్రగతి ఇంజనీరింగ్ కళాశాలలో కెమిస్ట్రీ, ఆర్&డి విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో పర్యావరణం, ఫార్మసీ, సాంకేతిక రంగాల్లో కెమిస్ట్రీ పరంగా చోటుచేసుకొంటున్న నూతన పోకడలపై నిర్వహించే జాతీయస్థాయి సదస్సు శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా జేఎన్టీయూకె మౌలిక వసతుల అభివృద్ధి డైరెక్టర్ డాక్టర్ వి. రవీంద్ర జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తూర్పుగోదావరి ప్రాంతంలో అధ్యాపకులు, విద్యార్థుల పురోగతి కోసం కళాశాల కెమిస్ట్రీ విభాగం, ఎసిటి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ సదస్సు ఎంతో ప్రాముఖ్యత కలిగివుందన్నారు. విద్యార్థులు, రీసెర్చ్ స్కాలర్స్, అధ్యాపకులు పరిశోధనా కార్యక్రమాలలో పాల్గొనడానికి ఈ కార్యక్రమం ఎంతో ప్రోత్సాహం కలిగిస్తుందన్నారు. కళాశాల చైర్మన్ డాక్టర్ పరుచూరి కృష్ణారావు మాట్లాడుతూ రసాయనశాస్త్రం దాని అనుబంధ శాస్త్రాలలో ప్రస్తుత కాలంలో చోటుచేసుకొంటున్న నూతన ఆవిష్కరణల గురించి అధ్యాపకులకు, విద్యార్థులకు అవగాహన కలుగచేసి వారిని నిపుణులుగా తీర్చిదిద్దడంలో తమ కళాశాల నిర్వహిస్తున్న మూడురోజుల జాతీయ స్థాయి సదస్సు తోడ్పడుతుందన్నారు. ప్రొఫెసర్ పి.వి.ఎస్. మాచిరాజు మాట్లాడుతూ వివిధ శాస్త్ర రీసెర్చ్ గ్రూపుల మధ్య విషయ పరిజ్ఞానాన్ని అంది పుచ్చుకోవడానికి మంచి వారధిగా ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందన్నారు. అనంతరం డాక్టర్ డి.వి. ప్రభు, డాక్టర్ దిబాన్కర్ చంద్ర దేకా మాట్లాడుతూ శాస్త్ర సాంకేతిక రంగాల వారికి ఈ సదస్సు ఎంతో ఉపయోగపడుతుందని, ఇటువంటి సదస్సు నిర్వహించడం ఎంతో గొప్ప విషయమన్నారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో జాతీయస్థాయి సదస్సు సావనీర్ ను ఆవిష్కరించి ఎసిటి సభ్యులకు అవార్డులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్.శంభూప్రసాద్, ఎసిటి ఈసీ మెంబర్ డాక్టర్ ఎం. కృష్ణమూర్తి, కళాశాల డైరెక్టర్ మేనేజ్మెంట్ ఎం.వి. హరనాథబాబు, డాక్టర్ జి. రఘురాం, వైస్ ప్రెసిడెంట్ ఎం.సతీష్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కె. సత్యనారాయణ, డీన్ అడ్మినిస్ట్రేషన్ డాక్టర్ జి. నరేష్, డాక్టర్ సుధా జైన్, డాక్టర్ ఎం.ఆర్.ఆర్. ప్రసాద్, ప్రొఫెసర్ ఎం. స్వామినాథన్, డాక్టర్ జి.ఎస్. సక్సేనా, చిత్తూరి మూర్తి, హెచ్వోడీలు, అధ్యాపకులు, తదితరులు పాల్గొన్నారు.







