Updated 4th May 2017 Thursday 11:00 AM
కాకినాడ : తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్‌గా ఎ.మల్లికార్జున నియమితులయ్యారు. 2012 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన ఈయన ప్రస్తుతం సీఆర్‌డీఏ అదనపు కమిషనర్‌గా పనిచేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిలో భాగంగా జిల్లా జాయింట్ కలెక్టర్‌గా డాక్టర్ మల్లికార్జునను నియమించారు. ఇటీవల జరిపిన ఐఏఎస్ బదిలీల్లో జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్‌ను ఒకేసారి బదిలీ చేశారు. కొత్తగా కలెక్టర్‌గా కార్తికేయ మిశ్రాను అప్పుడే నియమించారు. జాయింట్ కలెక్టర్ రానున్న మల్లికార్జున 2012 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి.







