రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా ఉందా..?

కాకినాడ: 31 అక్టోబరు 20202(రెడ్ బీ న్యూస్); గుంటూరు జైల్ భరో కార్యక్రమానికి టీడీపీ పిలుపునివ్వడంతో ఆ పార్టీ నాయకులను ఎక్కడికక్కడ పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. దీంతో టీడీపీ నేతల నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ నాయకుల హౌస్‌ అరెస్టులను ఆ పార్టీ సీనియర్ నేతలు యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్ప, గోరంట్ల బుచ్చియ్య చౌదరి, జ్యోతుల నెహ్రూ తదితరులు తీవ్రంగా ఖండించారు. శాంతియుత నిరసనలను అడ్డుకోవడం గర్హనీయమని వారు విమర్శించారు. అసలు ఏపీలో రూల్ ఆఫ్ లా ఉందా..? అని వారు ప్రశ్నించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని అణిచివేత ధోరణి ఏపీలో అమలవుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దరఖాస్తు చేసినా నిరసనలకు అనుమతులు ఇవ్వడం లేదని వారు ధ్వజమెత్తారు. అక్రమ గృహ నిర్బంధాలు అప్రజాస్వామికమని యనమల ఆగ్రహం వ్యక్తం చేశారు.
ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us