UPDATED 20TH MAY 2017 SATURDAY 1:00 PM
కాకినాడ : గోదావరి అర్బన్ డెవలప్‌మెంట్ అధారిటీ చైర్మన్ గా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి గన్ని కృష్ణ ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. రెండు, మూడు రోజుల్లో గన్ని బాధ్యతలు స్వీకరించనున్నారు. కాకినాడ కేంద్రంగా గోదావరి అర్భన్ అధారిటీ ప్రధాన కార్యాలయం ఏర్పాటు కానుంది. కొద్ది రోజుల క్రితం జిల్లా కలెక్టరు కార్తికేయ మిశ్రాను సాంకేతికంగా ఛైర్మన్ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. కలెక్టరు మిశ్రా నుంచి గన్ని కృష్ణ బాధ్యతలు స్వీకరిస్తారు. వైస్ ఛైర్మన్ గా రాజమహేంద్రవరం మునిసిపల్ కమీషనర్ విజయ రామరాజు నియమితులయ్యారు.







