హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్) 16 డిసెంబర్ 2021: తెలంగాణలోని అల్లు అర్జున్ అభిమానులకు శుభవార్త. సుకుమార్ దర్శకత్వంలో ఆయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘పుష్ప’. డిసెంబరు 17న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా తెలంగాణలో ఐదో షోకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న థియేటర్‌లలో ‘పుష్ప’ ఐదు షోలు వేయనున్నారు. ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ లభించింది. ‘పుష్ప’ రన్ టైమ్ 179.51 నిమిషాలు. రష్మిక కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్.







