పెద్దాపురం డివిజన్లో 122 గ్రామాల్లో రెవిన్యూ సదస్సులు

UPDATED 25th JUNE 2018 MONDAY 6:00 PM

పెద్దాపురం: పెద్దాపురం డివిజన్ పరిధిలో ఇంతవరకు 122 గ్రామ రెవెన్యూ సదస్సులు నిర్వహించినట్లు ఆర్డీవో ఎన్.ఎస్.వి.బి. వసంతరాయుడు తెలిపారు. స్థానిక ఆర్డీవో కార్యాలయంలో సోమవారం విలేఖరులతో ఆయన మాట్లాడుతూ డివిజన్ పరిధిలో 265 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయని, ఈ నెల 20వ తేదీ నుంచి గ్రామాల్లో నిర్వహిస్తున్న రెవిన్యూ సదస్సుల్లో భాగంగా ఇప్పటి వరకు 122 గ్రామాల్లో నిర్వహించామని చెప్పారు. డివిజన్ పరంగా రెవెన్యూ సదస్సులలో నేటి వరకు 22ఎ క్రింద 11 అర్జీలు రాగా 2 అర్జీలు తిరస్కరించామని, అలాగే డాటెడ్ ల్యాండ్సు (చుక్కలభూమి) క్రింద మూడు కొత్త ధరఖాస్తులు వచ్చాయని, 22ఎ లిస్టు క్రింద కొత్త ధరఖాస్తులు 65 వచ్చాయని తెలిపారు. సాదాబైనామా భూములకు సంబంధించిన అంశాలను కూడ ఈ సదస్సుల్లో నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు. జివో నెంబరు 321 ప్రకారం 2014 ముందున్న సాదాబైనామా భూములకు ఐదు ఎకరాల వరకు రిజిస్ట్రేషన్ ఫీజు స్టాంపు లేకుండా నమోదు చేయబడుతుందని, ఈ సదస్సుల్లో కౌలు రైతుల రుణ అర్హత కార్డులు పంపిణీ చేస్తున్నామని చెప్పారు. గ్రామ సభలు నిర్వహణకు అవసరమైన చోట రెండు బృందాలను ఏర్పాటు చేసి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని, ఒక బృందానికి తహసీల్దార్లు, రెండవ బృందానికి డిప్యూటీ తహసీల్దార్లు నేతృత్వం వహిస్తున్నారని చెప్పారు. గ్రామ రెవెన్యూ సదస్సులను ప్రతీ ఒక్కరూ సద్వినియోగం పేర్కొన్నారు. డివిజన్లో సాధికారిత సర్వే ప్రకారం ఇళ్ళులేని 9041 మందిని గుర్తించామని, వీటిలో జగ్గంపేట నియోజకవర్గానికి 3948, పెద్దాపురం నియోజక వర్గానికి 859, ప్రత్తిపాడు నియోజక వర్గానికి 2660, తుని నియోజకవర్గంలో 1574 మంది ఉన్నారని తెలిపారు. డివిజన్లో అందరికీ ఇళ్ళు పథకంలో భాగంగా 21292 గృహాలు మంజూరుకాగా, వీటిలో 9742 పూర్తికాగా, వర్కింగ్ ప్రోగ్రెస్ లో 7390, ప్రారంభించినవి 4160 ఉన్నాయని తెలిపారు. నియోజకవర్గంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతీ ఒక్కరూ ఓటరుగా నమోదు కావడానికి బూత్ లెవిల్ అధికారులు ఇంటింటికి తిరిగి సర్వేచేస్తున్నారని ఆయన తెలిపారు. 

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us