రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

UPDATED 10th NOVEMBER 2017 FRIDAY 7:30 PM

గండేపల్లి: రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ జ్యోతుల నవీన్‌ కుమార్ పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం జడ్‌.రాగంపేట గ్రామంలో సొసైటీ భవనంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జడ్పీ ఛైర్మన్‌ నవీన్‌ కుమార్, జాయింట్ కలెక్టర్ మల్లికార్జునతో కలిసి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా నవీన్‌ కుమార్ మాట్లాడుతూ రైతుల అభ్యున్నతిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏడాది రైతులు పండించే ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పిస్తూ రైతుల సంక్షేమానికి కృషి చేస్తోందన్నారు. జిల్లాలో పైలెట్‌ ప్రాజెక్టుగా తేమను తెలిపే యంత్రాన్ని నేరుగా రైతు కళ్ళంలోకి తీసుకెళుతున్నట్లు చెప్పారు. జాయింట్ కలెక్టర్ మల్లికార్జున మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 220 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని, ఈ కేంద్రాల్లో ఎ-గ్రేడ్‌ ధాన్యానికి రూ.1590, బి-గ్రేడ్‌ ధాన్యానికి రూ.1550 ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించిందన్నారు. రైతు ఇచ్చిన ధాన్యానికి మూడు రోజుల్లో నగదు వారి ఖాతాలకు జమ అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ డైరెక్టర్‌ కందుల కొండయ్యదొర, జగ్గంపేట ఎఎంసి చైర్మన్ ఎస్.వి.ఎస్. అప్పలరాజు, సొసైటీ అధ్యక్షుడు బొడ్డు సత్తిరాజు, పెద్దాపురం ఆర్డీవో విశ్వేశ్వరరావు, డీసీవో పాండురంగారావు, డి ఎస్ వో కృష్ణారావు, సర్పంచ్ చిట్టిబాబు, తహసీల్దారు గీతాంజలి, మండల వ్యవసాయ అధికారి విశ్వనాథ్‌, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సెక్రటరీ రామకృష్ణారెడ్డి, రైతులు, తదితరులు పాల్గొన్నారు. 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us