UPDATED 15th NOVEMBER 2022 TUESDAY 5:10 PM
CM KCR : తెలంగాణ భవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ నేతల కీలక సమావేశం జరుగుతోంది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, జిల్లాల పార్టీ అధ్యక్షులతో భేటీ అయ్యారు గులాబీ బాస్ కేసీఆర్. తాజా రాజకీయలపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. బీఆర్ఎస్ విస్తరణ, బీజేపీ వ్యతిరేక పోరాటం, రానున్న ఎన్నికల్లో ఘన విజయమే లక్ష్యంగా పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు కేసీఆర్. టీఆర్ఎస్ నేతల వ్యాపార సంస్థలపై జరుగుతున్న ఈడీ, ఐటీ దాడులపైనా ఈ సమావేశంలో చర్చించనున్నారు.
జాతీయ రాజకీయాల్లో బీఆర్ఎస్ పాత్రపై నేతలకు స్పష్టత ఇవ్వనున్నారు కేసీఆర్. అలాగే నియోజకవర్గాలకు ఇంఛార్జీల నియామకం, మంత్రులకు అదనపు బాధ్యతలు అప్పగించే ఛాన్స్ ఉంది. జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా అనుసరించాల్సిన విధానాలపై కేసీఆర్ క్లారిటీ ఇవ్వనున్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వ్యవహరించాల్సిన వ్యూహంపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు కేసీఆర్.







