ఆదిత్యలో వర్క్ షాప్

UPDATED 21st DECEMBER 2017 THURSDAY 6:00 PM

గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలకు చెందిన ఈసిఈ విభాగంలో ఒక రోజు వర్క్ షాప్ నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ టి.కె. రామకృష్ణారావు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా డి.ఆర్.డి.వొ విశ్రాంత శాస్త్రవేత్త ఎం.జవహర్ లాల్ హాజరై మాట్లాడారు. ఎలక్ట్రికల్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ లో ప్రపంచవ్యాప్తంగా వేగంగా మారుతున్న నూతన సంస్కరణలను అధ్యాపకులు ఎప్పటికప్పుడు గమనిస్తూ విద్యాభోధన చేయాలని, ఎలక్ట్రికల్ అండ్ కమ్యూనికేషన్ విభాగం అన్ని విభాగాలపైనా ప్రభావితం చూపుతుందన్నారు. పరిశ్రమలకు అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించుకోవాలని, అప్పుడే భారతదేశం సాంకేతికంగా పురోభివృద్ధి సాధిస్తుందని విద్యార్థులకు సూచించారు.  డి.ఆర్.డి.వొ ఆర్&డి ప్రాజెక్టులు ఆకాష్, సంయుక్త, డాల్ఫీన్ లలో పనిచేసిన అనుభవాలను విద్యార్థులతో పంచుకున్నారు. అనంతరం జవహర్ లాల్ ను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఈసీఈ విభాగాధిపతి విజయకృష్ణ , కిషోర్, విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.       

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us