ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు

UPDATED 28th FEBRUARY 2018 WEDNESDAY 7:00PM

సామర్లకోట: ప్రత్యేక హోదా విభజన హామీలపై ఉద్యమించడానికి సమయం ఆసన్నమైనదని, ప్రజలు ప్రజాస్వామ్యవాదులు, ప్రజాసంఘాల నాయకులు, హోదా ఉద్యమానికి సిద్ధం కావాలని సామర్లకోట పట్టణ ఐక్య వేదిక పిలుపునిచ్చింది. ఐక్య వేదిక రౌండ్ టేబుల్ సమావేశం స్థానిక విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘం భవనంలో పెదిరెడ్డి సత్యనారాయణ అధ్యక్షతన బుధవారం జరిగింది. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ ప్రత్యేక హోదా హామీతో ఎన్నికల్లో విజయం సాధించిన తెలుగుదేశం, బిజెపి, పార్టీలు ఆంధ్రాకు అన్యాయం చేశాయని అన్నారు. మానవ హక్కుల సంఘం అధ్యక్షుడు నూతలపాటి అప్పలకొండ మాట్లాడుతూ విభజన హామీలపై పోరాటం చేయడానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. అలాగే పలువురు ప్రత్యేక హోదా అంశం పై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు దొమ్మేటి వాసు, ఎలిశెట్టి రామదాసు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు దువ్వా సత్తిబాబు, వైసీపీ నాయకుడు మేకా శ్రీనివాస్, చిట్టిమాని శ్రీను, కామిరెడ్డి బోడకొండ, కుంచే నాని, ప్రజా సంఘాల నాయకులు పెద్దిరెడ్డి అర్జునరావు, సైదిరెడ్డి యువరాజు, బి.బాలాజీ, తుంపాల శ్రీను, పోతుల బాపిరాజు తదితరులు పాల్గొన్నారు.

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us