UPDATED 17th FEBRUARY 2018 SATURDAY 5:00 PM
పెద్దాపురం: తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం దివిలి కిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో ఫెస్ట్ ఉత్సవ్ రిజల్యూషన్స్ 2కె18 పోస్టర్ ను శనివారం కళాశాల చైర్మన్ బేతినీడి శ్రీనివాసరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగివున్న కళాత్మకత, సృజనాత్మకతలను వెలికి తీసేందుకు ఈ వేడుకలు అవకాశం కల్పిస్తాయన్నారు. దీనిలో భాగంగా విద్యార్థులకు ప్రాజెక్టులు, పోస్టర్ ప్రెజంటేషన్స్, షార్ట్ ఫిల్మ్ కాంపిటేషన్స్, మిమిక్రి, డాన్స్, తదితర పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని వివిధ ఇంజనీరింగ్ కళాశాలలకు చెందిన విద్యార్థులకు ఈ పోటీల్లో పాల్గొనే అవకాశం కల్పిస్తున్నామని, ఆసక్తి గల విద్యార్థులు తమ పేర్లు ముందుగా రిజిస్టర్ చేసుకోవాలన్నారు. ఈ వేడుకలకు ప్రముఖ బుల్లితెర నటీ, నటులు హాజరుకానున్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫెస్ట్ ఉత్సవ్ రిజల్యూషన్స్ 2కె18 కన్వీనర్ బేతినీడి వీరేంద్ర, ఇంచార్జ్ ప్రిన్సిపాల్ సర్వ రామేశ్వరుడు, ఈవో జెన్నిబాబు, ఏవో కె.ఆర్. సందీప్, ఏసీవో కె. పెదకాపు, వివిధ విభాగాల అధిపతులు రామకృష్ణ, బి.వి. రెడ్డి, కుమార్ రెడ్డి, విద్యార్థిని, విద్యార్థులు స్వామి, శివ, ప్రసాద్, అంజిరెడ్డి, లావణ్య, పద్మావతి, తదితరులు పాల్గొన్నారు.







