అమరావతి (రెడ్ బీ న్యూస్) 27 డిసెంబర్ 2021: ఒమిక్రాన్ భయాలు వెంటాడుతున్న వేళ వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సీఎం జగన్ సమావేశమయ్యారు. ఈ కీలక భేటీలో రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి మంత్రి ఆళ్ల నానితో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఒమిక్రాన్, కరోనా వ్యాప్తి కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షిస్తున్నట్టు సమాచారం. కొత్త ఏడాది వేడుకలపై కీలక నిర్ణయం తీసుకొనే అవకాశం ఉన్నట్టు సమాచారం.







