School Bus Accident : స్కూల్ బస్సుకు తప్పిన ప్రమాదం

Updated 24th April 2023 Monday 6:55 pm

School Bus Accident : స్కూల్ బస్సుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. మండల పరిధిలోని ఆర్.బి పట్నం నుంచి వాలుతిమ్మాపురం వెళ్లే రహదారిలో స్థానిక తోట చెరువు సమీపంలో భాష్యం స్కూలుకు చెందిన బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కగా ఒరిగిపోయింది. డ్రైవర్ మద్యం మత్తులో ఉన్న కారణంగా బస్సు అదుపు తప్పినట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 15 మంది విద్యార్థులు ఉన్నారు.

పాఠశాల సమయం అయిన తరువాత విద్యార్థులను వారి వారి గమ్యస్థానాలకు చేర్చేందుకు వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా బస్సు అదుపుతప్పి రోడ్డుపక్కగా ఒరిగిపోవడంతో బస్సులో ఉన్న పిల్లలు ఆందోళనతో ఆహాకారాలు చేశారు. ఇది గమనించిన స్థానికులు పిల్లలను బస్సులో నుంచి కిందకు దింపారు. పిల్లలకు ఎటువంటి ప్రమాదం జరగకుండా సురక్షితంగా బయటపడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇద్దరు విద్యార్థులకు మాత్రం అతి స్వల్ప గాయాలు కావడంతో వారిని స్థానిక ఏరియా ఆసుపత్రికి తీసుకువచ్చి వైద్య పరీక్షలు నిర్వహించారు.

ప్రమాద సంఘటన తెలుసుకున్న వెంటనే రాష్ట్ర హౌసింగ్ కార్పోరేషన్ చైర్మన్ దవులూరి దొరబాబు ఆసుపత్రికి చేరుకుని విద్యార్థులు, వారి తల్లిదండ్రులను పరామర్శించారు. యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని విద్యార్థులు తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us