నీరు-ప్రగతిలో 178 ఇరిగేషన్ చెరువులు అనుసంధానం

UPDATED 12th JUNE 2017 MONDAY 8:00 PM

కాకినాడ: నీరు-ప్రగతి కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 178 ఇరిగేషన్ చెరువులను అనుసంధానం చేస్తూ 32 గొలుసుకట్టు వ్యవస్థలను అభివృద్ధి చేస్తున్నామని జిల్లా కార్తికేయ మిశ్రా తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్లతో సోమవారం అమరావతి నుంచి  వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి నీరు-ప్రగతి పనులు, ఋతుపవనాల వల్ల రానున్న మూడు నెలల్లో వర్షపాత సూచన, భూగర్భజల మట్టం పెంపుదల కార్యాచరణ, రైతులకు విత్తనాలు, ఎరువులు, సూక్ష్మ పోషకాలు, పంట రుణాల పంపిణి, భూసార విశ్లేషణ కార్డుల పంపిణి, వ్యవసాయ యాంత్రీకరణ, ప్రకృతి వ్యవసాయ విధానాల ప్రోత్సాహం, ఎన్టీఆర్ గృహనిర్మాణ పురోగతి, అంగన్వాడీ, పంచాయతీ, పాఠశాలల భవనాల నిర్మాణం తదితర అంశాలపై సమీక్షించి ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇస్రో, ఐయండి, వాసర్ లాబ్స్ సంస్థలు జారీ చేసిన వాతావరణ సూచనల ప్రకారం నైరుతి ఋతుపవనాలు రాష్ట్రమంతటా తాకాయని, వీటి ప్రభావం వల్ల నెల్లూరు జిల్లా మినహా మిగిలిన అన్ని జిల్లాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైందని, జూన్, జులైల్లో మంచి వర్షపాత సూచన ఉన్నప్పటికి ఆగష్టులో డ్రై స్పెల్ ఏర్పడే అవకాశం వాతావరణ సంస్థలు తెలిపామన్నారు. ఈ సీజన్లో కురుస్తున్న వర్షజలాలను ఒడిసి పట్టి భూగర్భజలాల మట్టాన్ని పెంచాలని, ఇందుకు అన్ని జిల్లాల్లో చెరువులను పూర్తి స్థాయికి నింపాలని, గ్రావిటి వల్ల సాధ్యం కాని చోట్ల మొబైల్ లిఫ్ట్ లు వాడాలని ఆదేశించారు. రాష్ట్రం లో ఏ ప్రాంతంలో వర్షాభావం, నీటి కొరత ఎదురైనా పంటలను కాపాడేందుకు రైన్ గన్ వ్యవస్థలను వినియోగించాలని, అన్ని జిల్లాల్లో వీటి గురించి రైతులకు అవగాహన కల్పించేందుకు డెమోనిస్ట్రేషన్లు ఏర్పాటు చేయాలని, అలాగే తొంబై రోజుల నీరు-ప్రగతి కార్యక్రమం కింద చేపట్టని జల సంరక్షణ పనులను 38 రోజులలో పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. ప్రకృతి వైపరీత్యాల నుంచి తప్పించుకునేలా జూన్ నెల నుంచి ఎర్లీ ఖరీఫ్ సాగుకు రైతులను చైతన్య పరచాలని, ఎరువులు, విత్తనాలు కొరత లేకుండా చూడాలని, నూరు శాతం సబ్సిడీ పై సూక్ష్మ పోషకాలను రైతులకు అందించాలని, అలాగే 16 లక్షల మంది కౌలు రైతులకు పంట ఋణ సదుపాయం కల్పించాలని ఆదేశించారు. వ్యవసాయ యాంత్రీకరణ ప్రోత్సాహం కింద రాష్ట్ర వ్యాప్తంగా 200 కస్టమ్ హైరింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని, ఈ సంవత్సరం 1000 గ్రామాల్లో రూ.1.80 లక్షల మంది రైతులు లాభదాయకమైన ప్రకృతి వ్యవసాయ విధానం చేపట్టేలా ప్రోత్సహించాలన్నారు. ఎన్టీఆర్ గ్రామీణ పధకం కింద లబ్ధిదారుల ఎంపిక యూనిట్ గ్రౌండింగ్ మరింత ముమ్మరం చేయాలని ఆదేశించారు. అనంతరం కలెక్టర్ కార్తికేయ మిశ్రా జిల్లాలో ఋతుపవనాలు ప్రవేశంతో సాధారణ వర్షపాతం నమోదైందని ముఖ్యమంత్రికి తలిపారు. అలాగే మధ్య, తూర్పు డెల్టాల ఆయకట్టుకు నీరు విడుదల చేశామన్నారు. ఇప్పటివరకు 452 హెక్టార్లలో రైతులు నారుమళ్లు చేపట్టారని జులై  మొదటివారం లోపు నూరుశాతం నారుమళ్లు పూర్తవుతాయన్నారు. ఎన్టీఆర్ గ్రామీణ పథకం కింద 2016 -౧౭ సంవత్సరంలో ఈ వారంలో 3588 ఇళ్ళు శాంక్షన్ జారీ చేశామని ఇంకా పెండింగ్ ఉన్న మరో 7 వేల గృహాల శాంక్షన్ కోసం స్థానిక శాసన సభ్యులను కోరామని కలెక్టర్ ముఖ్యమంత్రికి వివరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్-2  జె. రాధాకృష్ణ మూర్తి, జిల్లా అటవీ అధికారిణి నందిని, ఇరిగేషన్ ఎస్ఈ రాంబాబు, వ్యవసాయ శాఖ జెడి కె.ఎస్.వి. ప్రసాద్, జెడ్ పి సీఈవో పద్మ, డీపీవో టి.వి.ఎస్.జి.కుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.       

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us