AP News : ఏపీలో ఉద్యోగుల బదిలీలకు గ్రీన్‌సిగ్నల్‌

UPDATED 7th JUNE 2022 TUESDAY 09:40 AM

AP government : ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు జగన్‌ సర్కార్‌ గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఉద్యోగుల బదిలీలకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఈమేరకు సీఎం జగన్‌ బదిలీల ఫైల్‌పై సంతకం చేశారు. జూన్‌ 17లోగా బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. ఇవాళ లేదా రేపు బదిలీలకు సంబంధించిన అధికారికి ఉత్తర్వులు వెలువడే అవకాశముంది.

ఇప్పటికే ఏపీలోని 13 జిల్లాలు ఉండగా ఉగాది నుంచి అదనంగా మరో 13 జిల్లాలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఏపీలో పాత, కొత్త జిల్లాలు కలిపి మొత్తం 26 జిల్లాలు ఏర్పాడ్డాయి. కొత్త జిల్లాల్లో ఉద్యోగాల భర్తీకి ఇప్పటివరకు ఎలాంటి చర్యలు గమనార్హం. సాధారణ బదిలీల్లో కొంతమందిని కొత్త జిల్లాలకు సర్దుబాటు చేయనున్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us