UPDATED 9th AUGUST 2017 WEDNESDAY 7:00 PM
రాజమహేంద్రవరం: దేశ సౌభాగ్యం కోసం ప్రతీ ఒక్కరూ దేశభక్తితో ముందుకు సాగాలని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే డాక్టర్ ఆకుల సత్యనారాయణ పిలుపునిచ్చారు. భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు సంకల్ప సిద్ధి కార్యక్రమంలో భాగంగా నవ్య భారతదేశం కోసం పునరంకిత కార్యక్రమంలో బుధవారం ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ కోటగుమ్మం నుంచి స్వాతంత్ర సమరయోధుల పార్క్ వరకూ కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ శ్రేయస్సు, అభివృద్ధి, సమగ్రత కోసం ప్రతీ ఒక్కరూ ప్రతిన పూనాలన్నారు. అనంతరం కోటిపల్లి బస్ స్టాండ్ దగ్గర ఉన్న సమరయోధుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు బాల సుబ్రమణ్య సింగ్, అయ్యల,గోపి, లాల్ బహదూర్ శాస్త్రి, ఎం.ఎస్.ఎస్. చంద్రశేఖర్, క్రొవ్విడి సురేష్, నాళం పద్మశ్రీ, ఎస్. కృష్ణార్జున చౌదరి, మట్టాడి చిన్ని, రౌతు వాసు, ఎస్.వి. రాణి, పెదిరెడ్ల రాజేశ్వరి, కోసూరి శ్రీనివాసరావు, అరిపాక లావణ్య, తంగుడు వెంకట్రావు, ఒమ్మి తులసి, అడ్డాల నాగేశ్వరావు, మోహన్, రొక్కం ఉమ, కె. చిన్ని తదితరులు పాల్గొన్నారు .







