Leopard Trapped : తిరుమలలో బోనులో చిక్కిన మరో చిరుత .. 50రోజుల వ్యవధిలో మూడు చిరుతలు..

Updated 17th August 2023 Thursday 7:10 am

Leopard Trapped In Cage: తిరుమల (Tirumala) లో మరో చిరుత పులి (Leopard) బోనులో చిక్కింది. తిరుమల నడకదారిలో లక్ష్మీ నరసింహస్వామి ఆలయం (Lakshmi Narasimhaswamy Temple) సమీపంలో ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కినట్లు అటవీశాఖ (Forest Department), టీటీడీ (TTD) అధికారులు తెలిపారు. గత మూడు రోజుల క్రితం ఓ చిరుత బోనులో చిక్కిన విషయం విధితమే. మూడు రోజుల వ్యవధిలోనే మరో చిరుతను అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారు. ఇటీవల అలిపిరి కాలినడక మార్గంలో చిరుత దాడి చేయడంతో నెల్లూరు జిల్లాకు చెందిన ఆరేళ్ల బాలిక లక్షిత మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చిరుతను బంధించేందుకు అటవీశాఖ, టీటీడీ అధికారులు తిరుమలకు వెళ్లే కాలినడక మార్గంలో మూడు ప్రాంతాల్లో బోనులు ఏర్పాటు చేశారు.

మోకాలిమెట్టు, లక్ష్మీనరసింహస్వామి ఆలయం, 35వ మలుపు వద్ద బోన్లు ఉంచారు. మూడు రోజుల క్రితం బోనులో ఒక చిరుత పులి చిక్కింది. తాజాగా గురువారం తెల్లవారు జామున మరో చిరుత చిక్కినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. మూడు రోజుల వ్యవధిలోనే రెండు చిరుత పులులు బోనులో చిక్కడంతో తిరుమలకు వెళ్లే భక్తులు కొంత ఊపిరి పీల్చుకున్నారు. ఇదిలాఉంటే 50రోజుల వ్యవధిలో మూడు చిరుత పులులను బంధించినట్లు అధికారులు చెప్పారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us