ప్రజా సమస్యల పరిష్కారానికే ఇంటింటికీ తెలుగుదేశం

UPDATED 11th SEPTEMBER 2017 MONDAY 7:00 PM

పెద్దాపురం : ప్రజా సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకే ప్రభుత్వం ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమాన్ని చేపట్టిందని రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం తాటిపర్తి  గ్రామంలోఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో మహిళలు మంత్రికి మంగళహారతులు పట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజల వద్దకు ప్రభుత్వాన్ని తీసుకువచ్చిన ఘనత దివంగత ముఖ్యమంత్రి ఎన్ టి ఆర్ కే దక్కిందని, ఆయన బాటలో పయనిస్తూ జన్మభూమి, ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. నియోజకవర్గంలో రహదారులను కోట్లాది రూపాయల వ్యయంతో అభివృద్ధి పరుస్తూ, పేదలందరికీ గృహాలు కల్పించాలనే ఉద్దేశంతో వాటిని మంజూరు చేశామన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 43 లక్షల మందికి పింఛన్లు అందిస్తున్నామని, జనవరిలో నిర్వహించే జన్మభూమిలో అర్హులైన వారందరికీ ఇస్తామన్నారు. త్వరలో రైతులకు మూడో విడత రుణమాఫీ కింద రూ. 3 వేల కోట్లు, డ్వాక్రా మహిళలకు వడ్డీ మాఫీకి రూ. 700 కోట్ల నిధులు అందిస్తామన్నారు. అనంతరం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన చేతుల మీదుగా ప్రారంభోత్సవాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి గుడాల రమేష్, మండల టిడిపి అధ్యక్షుడు కొత్తెం వెంకట శ్రీనివాసరావు( కోటి), గుడా డైరెక్టర్ ఎలిశెట్టి నాని, అన్నవరం దేవస్థానం పాలకమండలి సభ్యుడు కందుల విశ్వేశ్వరరావు, జిల్లా టిడిపి ఉపాధ్యక్షుడు కమ్మిల సుబ్బారావు, సీనియర్ టిడిపి నాయకుడు పచ్చిపాల సత్తిబాబు, టిడిపి జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి గవరసాన రాజశేఖర్,  జెడ్పిటిసి సుందరపల్లి శివ నాగరాజు, తిరుపతి సర్పంచ్ మెయిళ్ల కృష్ణమూర్తి , అధిక సంఖ్యలో టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.   

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us