ఆదిత్యలో వెబ్ డిజైనింగ్ పై వర్క్ షాప్

UPDATED 23rd DECEMBER 2017 SATURDAY 8:00 PM

గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ క్యాంపస్ లో ద్వితీయ సంవత్సరం బిటెక్ సి.ఎస్.ఇ & ఐ.టి విద్యార్థులకు వెబ్ టెర్మినాలజీ లెవెల్_2 అనే అంశంపై మూడురోజులు వర్క్ షాప్ నిర్వహించినట్లు ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. బెంగుళూరుకు చెందిన ప్రముఖ కంపెనీ CNEXAS కు చెందిన సాఫ్ట్ వేర్ డెవలపర్ బాలశశిధర్ నేతృత్వంలో నిర్వహించిన ఈ వర్క్ షాప్ లో వెబ్ డిజైనింగ్ లో నూతన ఆవిష్కరణలు గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్స్ వి. .శ్రీనివాసరావు, డాక్టర్ ఎస్. రమాశ్రీ, వానతి, కో ఆర్డినేటర్లు, అధ్యాపకులు, తదితరులు పాల్గొన్నారు.          

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us