ఆదిత్యలో ఘనంగా ప్రారంభమైన గ్రంథాలయ వారోత్సవాలు

UPDATED 14th NOVEMBER 2017 TUESDAY 8:00 PM

గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య క్యాంపస్ లో 50వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను ఇంజనీరింగ్ కళాశాలల డైరెక్టర్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి, ఫార్మసీ కళాశాలల డైరెక్టర్ డాక్టర్ కె. రవిశంకర్, బిజినెస్ స్కూల్ డైరెక్టర్ డాక్టర్ ఎన్.సుగుణారెడ్డి మంగళవారం ఘనంగా ప్రారంభించారు. జాతీయ గ్రంథాలయ ఉద్యమ కారకులు, దేశంలోని గ్రంథాలయ సంస్థలను ఏకం చేసి ఒకే చోట సమావేశపరిచి జాతీయ గ్రంథాలయాల సంఘం ఏర్పాటుకు ముఖ్య నాయకుడు అయ్యంకి వెంకట రామయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ వారోత్సవాలలో భాగంగా పుస్తక ప్రదర్శన, వకృత్వ, వ్యాసరచన తదితర  పోటీలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్స్ డాక్టర్ టి.కె. రామకృష్ణారావు, ప్రొఫెసర్ ఆదిరెడ్డి రమేష్, డాక్టర్ ఎన్. విశాలాక్షి, డాక్టర్ దివాకర్, డాక్టర్ మోహన్, వైస్ ప్రిన్సిపాల్స్, శాఖాధిపతులు, గ్రంథాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.      

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us