AP News: కొత్త జిల్లాల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం

Updated 25 January 2022 Tuesday 09:20 PM

అమరావతి (రెడ్ బీ న్యూస్): ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో ప్రస్తుతం 13 జిల్లాలున్నాయి. ఈ సంఖ్యను పెంచాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో జిల్లాల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేసింది. మొత్తం 26 జిల్లాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. లోక్‌సభ నియోజకవర్గాల వారీగా కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. కొత్త జిల్లాల ఏర్పాటుకు ఆన్‌లైన్‌లోనే మంత్రుల నుంచి ప్రభుత్వం ఆమోదం తీసుకుంది. కొత్త జిల్లాల వివరాలను ఆన్‌లైన్‌లోనే సర్క్యూలేట్‌ చేసింది. 1974 ఏపీ జిల్లాల(ఏర్పాటు) చట్టంలోని సెక్షన్‌-3(5) ప్రకారం కొత్త జిల్లాల ఏర్పాటును ప్రారంభించింది.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us