జాతీయ స్థాయి టెక్ ఫెస్ట్ "వేద -2 కె 17 " ఏర్పాట్లు పూర్తి

UPDATED 13th SEPTEMBER 2017 TUESDAY 8:00 PM

గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలలో ఈ నెల 15,16 తేదీల్లో జరగనున్న జాతీయ స్థాయి టెక్ ఫెస్ట్ వేద -2  కె 17 కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు ఆదిత్య విద్యాసంస్థల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి బుధవారం తెలిపారు. జాతీయ స్థాయి టెక్ ఫెస్ట్ వేద -2  కె 17 పేరిట నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, కేరళ, తదితర రాష్ట్రాల నుంచి ఇంజనీరింగ్ విద్యార్థులు పాల్గొంటారన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా కాకినాడ ఓ ఎన్ జి సి జనరల్ మేనేజర్ ఎస్. సత్యపాల్ పాల్గొంటారని, ఇప్పటికే అన్ని ఇంజనీరింగ్ కళాశాలలకు ఆహ్వాన పత్రాలు పంపామని, విద్యార్థుల్లో దాగివున్న సృజనాత్మకత, ఆవిష్కరణలను ప్రదర్శించుటకు ఇది ఒక చక్కని వేదికని ఆయన పేర్కొన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ వివిధ కళాశాలల నుంచి వచ్చే విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్స్ డాక్టర్ టి.కె. రామకృష్ణారావు, ప్రొఫెసర్ ఆదిరెడ్డి రమేష్, వైస్ ప్రిన్సిపాల్స్, తదితరులు పాల్గొన్నారు.       

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us