ఆషిక్ లో వివో v 5 s మోడల్ విడుదల

UPDATED 6TH MAY 2017 SATURDAY 11:30 AM

పెద్దాపురం : ప్రముఖ చైనామొబైల్ దిగ్గజ సంస్థ వివో సరికొత్త ఫీచర్స్ తో ప్రతిష్టాత్మకంగా విడుదల చేసిన వివో v 5 s  మోడల్ స్మార్ట్ ఫోన్ ను తూర్పుగోదావరి జిల్లాలో మొదటిసారిగా పెద్దాపురం పట్టణంలో శనివారం విడుదల చేశారు. పట్టణంలోగల ప్రముఖ మొబైల్ షోరూం ఆషిక్ మొబైల్ కమ్యూనికేషన్స్ లో చైనాకు చెందిన కంపెని ప్రతినిధులు మౌంటీ, లొఫిన్ లు మొబైల్ మొదటి కొనుగోలుదారు గొల్లపల్లి బాబ్జి కి అందచేసి కేక్ ను కట్ చేశారు. అనంతరం కంపెని ప్రతినిధులు మాట్లాడుతూ అత్యాధునిక ఫీచర్స్ తో మార్కెట్లోకి ఈ స్మార్టు ఫోన్ ను విడుదల చేయడం జరిగిందన్నారు. అలాగే దీనిలో 4జిబి ర్యామ్ తో 256 జిబి వరకు పెంచుకునే సామర్థ్యం , 5.5 అంగుళాల హెచ్ డి డిస్ ప్లే ,13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 20 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా,౩౦౦౦ ఎంఏహెచ్ బ్యాటరీ, మీడియాటెక్ ఎంటి 6750 ప్రాసెసర్ మొదలైన అత్యాధునిక ఫీచర్స్ ఈ స్మార్ట్ ఫోన్ లో ఉన్నట్లు వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వివో ఆంధ్రప్రదేశ్ మేనేజర్ సురేష్ రెడ్డి, డిస్ట్రిబ్యూటర్స్ ఎం.శేషుబాబు, ఏ.కుమార్, ఆషిక్ మొబైల్ కమ్యూనికేషన్స్ అధినేతలు ఆషిక్ ఆలీ, ముస్తాక్ ఆలీ, కంపెనీ సిబ్బంది రవికమాల్, రామశేషు తదితరులు పాల్గొన్నారు.          

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us