UPDATED 2nd SEPTEMBER 2017 4:00 PM
పెద్దాపురం: స్థానిక పెద్ద మసీద్ వీధిలోని షాహీ జామియా మసీద్ లో త్యాగానికి ప్రతికగా నిలిచే, దైవభీతిని జనింపజేసే బక్రీద్ పండుగ ఈద్ నమాజ్ ను పట్టణ, పరిసర ప్రాంత ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. మసీద్ ఇమాం అబ్దుల్ గఫ్ఫార్ ఖాన్ నమాజ్ ప్రార్ధనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముస్లిం అంజుమన్ వెల్ఫేర్ అసోసియేషన్, మసీద్ కమిటీ ప్రెసిడెంట్ మహమ్మద్ ముక్తార్ ఆలీ ముస్లిం సోదరులకు ఈదుల్ అజహ్ ప్రశస్తి ని వివరిస్తూ స్తోమత కలిగిన ప్రతి ముస్లిం ఖుర్బాని' ఇవ్వాలని, మసీద్ అభివృద్ధికి ఇతోధిక అందిస్తున్న ముస్లిం సోదరులకు కృతజ్ఞతలు తెలిపారు. నమాజ్ అనంతరం ముస్లిం సోదరులు ఒకరికొకరు ఆలింగనం చేసుకొంటూ బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. ఈ కార్యక్రమంలో ఎం.ఎల్.ఆలీ బ్రదర్స్, బాబులాల్, నబి, జాకీర్, నజీర్, రఫీ, జలీల్, షబ్బీర్, రబ్బాని, ఇర్ఫాన్, అహ్మద్ అలీ, ఖాదర్ తదితరులు పాల్గొన్నారు.







