ఆదిత్య గ్లోబల్ బిజినెస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ

UPDATED 18th SEPTEMBER 2017 MONDAY 7:30 PM

గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య గ్లోబల్ బిజినెస్ స్కూల్ పిజిడిఎం విద్యార్థులు ఐసీఐసీఐ లాంబోర్డ్ జనరల్ ఇన్సూరెన్స్ పబ్లిక్ ఇష్యూ విశ్లేషణలో ప్రతిభ కనబరిచినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్. విశాలాక్షి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఫైనాన్స్ ప్రొఫెసర్ మెహెర్జీ  దువ్వూరు ఆధ్వర్యంలో పిజిడిఎం విద్యార్థులు కె. సుజాత, ఎం.ఝాన్సీ, ఎం.వి.వి. రఘురాం, ఎం.మూర్తి, యూ. విశ్వనాథ్, గ్లోబల్ ఎంబీఏ కు చెందిన దివ్య  ఈ పరిశోధనలో పాల్గొన్నట్లు ఆమె పేర్కొన్నారు. ఈ పబ్లిక్ ఇష్యూ మధ్య , దీర్ఘకాలిక మదింపుకు అనుకూలమని విద్యార్థులు తెలియచేసినట్లు ఆమె పేర్కొన్నారు. అనంతరం విద్యార్థులు మాట్లాడుతూ 2000 సంవత్సరంలో ప్రారంభమైన ఐసీఐసీఐ లాంబోర్డ్ సెక్టార్ లో అతి పెద్ద జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ అని పేర్కొన్నారు. ఈ కంపెనీ ప్రస్తుతం 5700 కోట్లు పబ్లిక్ ఇష్యూ ద్వారా సమీకరిస్తోందని పేర్కొన్నారు. అనంతరం ప్రొఫెసర్ మెహెర్జీ మాట్లాడుతూ తమ ఫైనాన్స్ విభాగం విద్యార్థులచే ఈ విధమైన ప్రాజెక్టులు చేయిస్తున్నామని, తద్వారా విద్యార్థులకు ప్రాక్టికల్ గా ప్రతిభ పెరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ ఎన్. సుగుణారెడ్డి, ఫైనాన్స్ విభాగానికి చెందిన డాక్టర్ దుర్గా ప్రసాద్, వెంకటేశ్వరావు, గోవర్ధన్ రెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు.         

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us