AP News: దేవాలయాల్లోని ఆనవాయితీలపై ప్రశ్నిస్తే దాడులా?: చంద్రబాబు

అమరావతి (రెడ్ బీ న్యూస్) 22 డిసెంబర్ 2021: దేవాలయాల్లో పాటించాల్సిన ఆనవాయితీలపై ప్రశ్నిస్తే దాడులు చేసే సంస్కృతికి వైసీపీ ప్రభుత్వం దిగజారిందని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం రామతీర్థం బోడికొండపై కోదండ రామాలయం నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమంలో నెలకొన్న ఉద్రిక్తతపై చంద్రబాబు స్పందించారు. టీడీపీ మంత్రులు వీధి రౌడీల్లా ప్రవర్తిస్తున్నారని ధ్వజమెత్తారు. రామతీర్థం ఆలయ కమిటీ ధర్మకర్తగా ఉన్న అశోక్ గజపతిరాజు పేరు లేకుండా కార్యక్రమాలు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. వేల ఎకరాలను దానం చేసిన కుటుంబానికి ఇచ్చే గౌరవం ఇదేనా అని నిలదీశారు. కనీసం ప్రోటోకాల్ పాటించాలనే బుద్ధి ఈ ప్రభుత్వ పెద్దలకు లేదా అని చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అశోక్ గజపతిరాజుపై కక్షగట్టారని.. మాన్సాన్ ట్రస్టు ఛైర్మన్‌గా తొలగించి భూములు దోచుకోవాలని చూశారని ఆరోపించారు. రామతీర్థం దేవాలయ నిర్మాణానికి అశోక్ గజపతిరాజు విరాళం ఇస్తే ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. రామతీర్థంలో రాముడి తల ధ్వంసం చేసి ఏడాది గడుస్తున్నా ఇప్పటికీ నిందితులను పట్టుకోలేదని మండిపడ్డారు. వైసీపీ అరాచక, దుర్మార్గపు పాలన ఎల్లకాలం సాగవని చంద్రబాబు పేర్కొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us