గ్రామ గ్రామాన గీతాపారాయణం

Updated 22nd April 2017 Saturday 5: 30 PM

పెద్దాపురం: భగవద్గీత ప్రచార సమితి ఆధ్వర్యంలో స్థానిక పాత పెద్దాపురం కోటముందు రామాలయం వద్ద శనివారం గీతాపారాయణం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భగవద్గీత ప్రచార సమితి అధ్యక్షుడు మల్లికార్జునస్వామి హాజరై మాట్లాడారు. భగద్గీత పై ప్రజలకు అవగాహన మరింత పెంచేందుకు, ఆధ్యాత్మిక విలువలను పెంపొందించేందుకు భగవద్గీత ప్రచార సమితి ఆధ్వర్యంలో గ్రామ గ్రామాన గీతాపారాయణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ గీతాపారాయణ కార్యక్రమానికి కోటముందు రామాలయం కమిటీ తమ సంపూర్ణ సహాయ సహకారాలను అందచేశారు. ఈ కార్యక్రమంలో భగద్గీత ప్రచార సమితి కన్వీనర్ పచ్చిపాల ప్రసాదరావు ( గోరింట ప్రసాద్), ఆర్గనైజర్ సత్యకుమార్, సభ్యులు పెద్దింటి నూకామణి, నేతి వీరభద్రరావు, తదితరులు పాల్గొన్నారు.     
 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us