UPDATED 7th JUNE 2017 WEDNESDAY 4:00 PM
పెద్దాపురం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్నిఅడ్డగోలుగా విభజించి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి, జిల్లా ఇంఛార్జ్ మంత్రి కళా వెంకట్రావు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం పట్టణంలో హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అధ్యక్షతన స్థానిక ఆర్య వైశ్య కళ్యాణమండపంలో నిర్వహించిన నవనిర్మాణ దీక్ష కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని బుధవారం మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పీకల్లోతు కష్టాల్లోకి నెట్టి ఆనాటి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజలకు కన్నీళ్లను మిగిల్చిందన్నారు. విభజన జరిగే నాటికి రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉందని అయినా సరే ముఖ్యమంత్రి చంద్రబాబు ధైర్యంగా రాష్ట్రాన్నిఅభివృద్ధి దిశగా నడిపిస్తున్నారన్నారు. ప్రపంచదేశాలు తిరిగి రాష్ట్రానికి పెట్టుబడులను తీసుకువస్తున్నారని పేర్కొన్నారు. అలాగే లోటు బడ్జెట్ ఉన్న ప్రజలకు అన్నిసంక్షేమ ఫథకాలను నిరాటంకంగా కొనసాగిస్తున్నట్లు చెప్పారు. పింఛన్లు ఐదు రెట్లు పెంచిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకు దక్కుతుందన్నారు. అభివృద్ధిని చూసి ఓర్వలేక పిల్ల కాంగ్రెస్ అసత్య ఆరోపణలు చేస్తోందని ఎద్దేవా చేశారు. హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన పేర్కొన్నారు. పెద్దాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తున్నామని పేర్కొన్నారు. ప్రజల సహకారంతో ముందుకు సాగుతున్నట్లు మంత్రి పేర్కొన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా మాట్లాడుతూ ప్రజా సంక్షేమ పథకాలు అందిరికీ అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, పెద్దాపురం నియోజకవర్గం హోం మంత్రి చినరాజప్ప హాయంలో మరింత ముందుకు సాగుతోందని, పెద్దాపురం నియోజకవర్గం హోం మంత్రి ఆధ్వర్యంలో మోడల్ నియోజకవర్గంగా రూపుదిద్దుకోవడం ఖాయం అన్నారు. అలాగే శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, జాయింట్ కలెక్టర్ ఎ.మల్లి ఖార్జున, జిల్లా అటవీ శాఖాధికారిణి నందిని తదితరులు మాట్లాడారు. అలాగే పలు శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను తిలకించారు. అలాగే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అభివృద్ధి కార్యక్రమాలను వీక్షించారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి ఛైర్మన్ వరుపుల రాజా, పెద్దాపురం, సామర్లకోట, జగ్గంపేట ఎఎంసి ఛైర్మన్లు ముత్యాల వీరభద్రరావు (రాజబ్బాయి), పాలకుర్తి శ్రీనివాసాచార్యులు, ఎస్.వి.ఎస్.అప్పలరాజు, పెద్దాపురం, సామర్లకోట మున్సిపల్ ఛైర్మన్లు రాజా సూరిబాబురాజు, మన్యం పద్మావతి, పెద్దాపురం మున్సిపల్ వైస్ చైర్మన్ కొరుపూరి రాజు, గుడా డైరెక్టర్ ఎలిశెట్టి నాని, మండల టిడిపి అధ్యక్షుడు కొత్తెం వెంకట శ్రీనివాసరావు (కోటి), ఎంపిపి గుడాల రమేష్, పెద్దాపురం ఏరియా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ ఛైర్మన్ బొడ్డు బంగారుబాబు, పట్టణ టిడిపి అధ్యక్ష, కార్యదర్శులు రంధి సత్యనారాయణ, తూతిక రాజు, పెద్దాపురం, సామర్లకోట జెడ్పిటిసిలు సుందరపల్లి శివనాగరాజు, గుమ్మళ్ల విజయలక్ష్మి, ఎంపిడివో పి.వసంతమాధవి, పలు శాఖల అధికారులు, నాయకులు పాల్గొన్నారు.







