మరిడమ్మ అమ్మ వారి జాతర మహోత్సవాలకు పటిష్ఠ బందోబస్తు

UPDATED 15th JUNE 2017 THURSDAY 6:00 PM

పెద్దాపురం: భక్తుల కొంగు బంగారం పెద్దాపురం మరిడమ్మ  అమ్మవారి జాతర మహోత్సవాలు ఈ నెల 24 నుంచి ప్రారంభం కానున్ను నేపథ్యంలో జాతర బందోబస్తు ఏర్పాట్లను డిఎస్పీ ఎస్. రాజశేఖరరావు గురువారం సమీక్షించారు. జాతరలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా చర్యలు చేపట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే యాత్రికుల సౌకర్యార్థం ఈ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అలాగే జాతరకు వచ్చే భక్తుల వాహనాల పార్కింగ్, షాపుల నిర్వహణ, ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అలాగే  అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఇబ్బంది కలుగకుండా బారికేడ్లు ఏర్పాటు మొదలైన విషయాలపై దేవస్థానం అసిస్టెంట్ కమీషనర్ ఆర్.పుష్పనాథంతో సమీక్షించారు. ఈ కార్యక్రమంలో సీఐ ప్రసన్న వీరయ్య గౌడ్, ఎస్ఐ కృష్ణభగవాన్, ధర్మకర్తలు ఆకుల మురళీకృష్ణ, కొంగర  సత్యనారాయణ, గోలి శ్రీరాములు, కొఠాని గణేష్, ఆర్.విజయ్ కుమార్, శివ దేవస్థానం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us