UPDATED 21st OCTOBER 2022 FRIDAY 04:15 PM
Police Commemoration Day : శాంతి భద్రతలు బాగుంటేనే సమాజం అభివృద్ధి చెందుతుందని సంఘ విద్రోహశక్తుల కార్యకలాపాలు అరికట్టడంలో పోలీసులు పాత్ర ఎంతో కీలకమని సర్కిల్ ఇనస్పెక్టర్ (Circle Inspector) అబ్దుల్ నబీ పేర్కొన్నారు. మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ (Police Station) లో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ వీధులగుండా ర్యాలీ నిర్వహించి అమరులైన పోలీసు వీరులకు ఘనంగా నివాళులు అర్పించారు.
అనంతరం సిఐ అబ్దుల్ నబీ మాట్లాడుతూ అమరవీరుల స్ఫూర్తితో శాంతి భద్రతల పరిరక్షణతో పాటు నేరరహిత సమాజ స్థాపనకు కృషి చేస్తామని తెలిపారు. ప్రపంచమంతా నిద్రలో ఉంటే పోలీసులంతా మెలుకువ ఉండి శాంతిభద్రతల పరిరక్షణ కోసం కాపలా కాస్తుంటారని అన్నారు. ప్రాణాలను పణంగా పెట్టి ప్రజల కోసం పోలీసులు చేసిన త్యాగాలకు సానుభూతి, గౌరవం చూపించడం మన అందరి బాధ్యతని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సామర్లకోట సర్కిల్ ఇనస్పెక్టర్ (CI) దుర్గాప్రసాద్, ఎస్ఐ (SI) రావూరి మురళీమోహన్, మున్సిపల్ కమీషనర్ (Muncipal Commissioner) జంపా సురేంద్ర, పోలీసులు, విద్యార్థినీ, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.







