UPDATED 13th MAY 2018 SUNDAY 9:00 PM
సామర్లకోట: స్థానిక కంచి మహాసంస్థానం అధ్యక్షులు చంద్రాభట్ల చింతామణి గణపతిశాస్త్రి గృహంలో నిర్వహించిన ప్రత్యేక పూజలలో సీనియర్ ఐఏఎస్ అధికారి ఎల్.వి. సుబ్రహ్మణ్యం, జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రాలు ఆదివారం పాల్గొన్నారు. గణపతి శాస్త్రి వారిని సాదరంగా ఆహ్వానించారు. అనంతరం అధికారులను సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. వారి వెంట రాజమహేంద్రవరం సబ్- కలెక్టర్ విజయరామరాజు, తహసీల్దారు ఎల్. శివకుమార్, తదితరులు పాల్గొన్నారు.







