Adipurush: ఒక్క అప్డేట్ వస్తే.. అన్నీ సైలెంట్ అవుతాయి!

UPDATED 1st NOVEMBER 2022 TUESDAY 06:10 PM

Adipurush: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ ‘ఆదిపురుష్’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీగా ఉంది. దసరా సందర్భంగా ఈ చిత్ర టీజర్‌ను రిలీజ్ చేయగా, దానికి పాజిటివ్ రెస్పాన్స్ కంటే కూడా నెగెటివ్ ట్రోలింగ్స్ ఎక్కువగా వచ్చాయి. దీంతో ఈ సినిమాను ముందుగా ప్రకటించినట్లుగా సంక్రాంతి బరిలో రిలీజ్ చేస్తారో లేదో అనే సందేహం అందరిలో నెలకొంది. అయితే ఇటీవల ఆదిపురుష్ సినిమాను సంక్రాంతి బరి నుండి తప్పించి రిలీజ్‌ను వాయిదా వేస్తున్నట్లుగా సోషల్ మీడియాలో వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఆందోళనకు గురవుతున్నారు. నిజంగానే తమ అభిమాన హీరో సినిమాను వాయిదా వేస్తున్నారా.. ఒకవేళ వేస్తే.. అది ఎప్పటికి రిలీజ్ అవుతుందో అని వారు ఆసక్తిగా చూస్తున్నారు. అయితే ఈ వార్తల్లో నిజం ఎంతవరకు ఉందనే విషయాన్ని మాత్రం వారు తేల్చలేకపోతున్నారు.

దీంతో ఆదిపురుష్ చిత్ర వాయిదాపై వస్తున్న పుకార్లకు, సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ట్రోలింగ్స్‌కు చిత్ర యూనిట్ ఒక సరికొత్త అప్డేట్‌తో సమాధానం చెబితే బాగుంటుందని వారు ఆశిస్తున్నారు. మరి ఆదిపురుష్ చిత్రానికి సంబంధించి వస్తున్న వార్తలకు చిత్ర యూనిట్ రెస్పాండ్ అవుతుందో లేదో చూడాలి. ఇక ఈ సినిమాను బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కిస్తుండగా, కృతి సనన్, సైఫ్ అలీ ఖాన్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us