పోలియో రహిత సమాజానికి కృషి చేద్దాం
పెద్దాపురం : పోలియో రహిత సమాజానికి ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని పెద్దాపురం మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబు రాజు, పెద్దాపురం ఏరియా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ బొడ్డు బంగారు బాబు పేర్కొన్నారు. స్థానిక ఏరియా ఆసుపత్రి లో రెండో విడత పల్స్ పోలియో కార్యక్రమం లో భాగం గా చిన్నారులకు పోలియో చుక్కలు మందును వేశారు. అనంతరం వారు మాట్లాడుతూ సమాజంలో పోలియో మహమ్మారిని తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. చిన్నారుల సంక్షేమం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధిక నిధులు వెచ్చిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో ఏరియా ఆసుపత్రి వైద్యులు డాక్టర్ సుదీప్తి, హిమబిందు, శానిటరీ ఇనస్పెక్టర్ డేవిడ్ రాజు , ఆసుపత్రి సిబ్బంది, ఆశాలు తదితరులు పాల్గొన్నారు.







