UPDATED 19th AUGUST 2022 FRIDAY 01:00 PM
Blast in Kakinada district Sugar Factory : ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని వాకలపూడి షుగర్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు చోటు చేసుకొంది.ఈ పేలుడులో ముగ్గురు మృతి చెందారు. మరో నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడినవారిలో ఇద్దరిని కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. మరో ఇద్దరిని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. కన్వేయర్ బెల్ట్ పేలి పేలుడు సంభవించినట్లుగా సమాచారం. ఈ ఘటనపై సమాచారం అందుకున్న మాజీ మంత్రి కన్నబాబు పరిస్థితిని పరిశీలిస్తున్నారు. బాధిత కుటుంబాలకు ధైర్యం చెబుతున్నారు.







