రిపబ్లిక్‌డే పెరేడ్‌కు ఇద్దరు విద్యార్థినుల ఎంపిక

UPDATED 14th DECEMBER 2017 THURSDAY 8:00 PM

రాజానగరం: దేశ రాజధాని ఢిల్లీలో జనవరి 26న  జరిగే రిపబ్లిక్‌డే పెరేడ్‌ వేడుకలకు తూర్పుగోదావరి జిల్లా ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం నుంచి ఇద్దరు విద్యార్థినులు ఎంపికయ్యారని వైస్ ఛాన్సలర్ ఆచార్య ఎం.ముత్యాలునాయుడు తెలిపారు. విద్యార్థినులు ఎ.స్వాతిప్రియ (ఆదిత్య డిగ్రీ కళాశాల, రాజమహేంద్రవరం), బి.పుష్పాలత (ఎస్‌.కె.ఆర్‌.ఉమెన్స్‌ కళాశాల) ఎంపికయ్యారని, ఆంధ్రప్రదేశ్‌ నుంచి 8 మంది విద్యార్థినులను ఎంపిక చేయగా వారిలో ఇద్దరు గోదావరి జిల్లాలకు చెందిన వారు కావడం గర్వకారణమన్నారు. వీరు ఈ నెల 29న ఢిల్లీ  వెళ్లి అక్కడ ప్రత్యేక శిక్షణ తీసుకుని జనవరి 26న జరిగే రిపబ్లిక్‌డే వేడుకల్లో పాల్గొంటారన్నారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us