KGF 3: ‘కేజీయఫ్ 3’పై సరికొత్త బజ్.. స్టార్ట్ అయ్యేది అప్పుడేనట!

Updated 10th March 2023 Friday 8:55 pm

KGF 3: కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ‘కేజీయఫ్’, ‘కేజీయఫ్ 2’ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేశాయో మనం చూశాం. పాన్ ఇండియా మూవీగా ఈ సినిమాలు కళ్లు చెదిరే కలెక్షన్స్ రాబట్టి అందరినీ అవాక్కయ్యేలా చేశాయి. ఇక ఈ సినిమాతో కన్నడ హీరో యశ్ ఒక్కసారిగా పాన్ ఇండియా హీరోగా తన స్థాయిని అమాంతం పెంచేసుకున్నాడు.

కాగా కేజీయఫ్ 2 సినిమా క్లైమాక్స్‌లో ఈ సినిమాకు మరో సీక్వెల్ ఉండబోతుందనే హింట్ ఇచ్చింది చిత్ర యూనిట్. దీంతో, ఈ సీక్వెల్ మూవీ ఎప్పుడెప్పుడు పట్టాలెక్కుతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. కానీ, ఈ సీక్వెల్ ఇప్పట్లో పట్టాలెక్కే అవకాశం లేదని చిత్ర వర్గాలు చెప్పుకొచ్చాయి. అయితే, ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌తో ‘సలార్’ అనే మూవీని తెరకెక్కిస్తున్న ప్రశాంత్ నీల్, ఇప్పుడు కేజీయఫ్ 3 మూవీని వీలైనంత త్వరగా పట్టాలెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాడట.

సలార్ తరువాత తన నెక్ట్స్ మూవీని యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో కలిసి చేయబోతున్న ప్రశాంత్ నీల్, ఆ సినిమాను చాలా వేగంగా పూర్తి చేయాలని భావిస్తున్నాడట. ఈ సినిమాను అనుకున్న సమయానికంటే ముందే ముగించి, ఆ తరువాత కేజీయఫ్ 3 ప్రాజెక్ట్‌ను స్టార్ట్ చేయాలని చూస్తున్నాడట. దీంతో కేజీయఫ్ 3 మూవీపై ఈ బజ్ ఇప్పుడు సినీ వర్గాల్లో మరోసారి ఆసక్తిని క్రియేట్ చేస్తోంది.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us