Amaravati Farmers Padayatra : అమరావతి రైతుల పాదయాత్రకు బ్రేక్.. కోర్టులోనే తేల్చుకుంటామన్న జేఏసీ

UPDATED 22 nd OCTOBER 2022 SATURDAY 05:00 PM

Amaravati Farmers Padayatra : అమరావతి రైతుల పాదయాత్రకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. పోలీసుల తీరుకి నిరసనగా నాలుగు రోజుల పాటు బ్రేక్ వేశారు రైతులు. పోలీసుల తీరుపై కోర్టులోనే తేల్చుకుంటామని అమరావతి జేఏసీ నేతలు అంటున్నారు. ప్రస్తుతం రామచంద్రాపురంలో రైతులు ఉన్నారు.రైతులు కల్యాణ మండపం నుంచి రాకుండా పోలీసులు అడ్డుకున్నారు.

గుర్తింపు కార్డులు చూపిస్తేనే బయటకు పంపుతామని పోలీసులు అంటున్నారు. మరోవైపు రాతపూర్వకంగా ఇవ్వాలని అమరావతి రైతులు అంటున్నారు. ఇతరులెవరూ అమరావతి రైతులను కలవకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు.

పోలీసులు అడ్డంకులు కల్పిస్తున్నారని ఆరోపిస్తూ తాత్కాలికంగా యాత్రను నిలిపేస్తున్నట్లు రైతుల ప్రకటించారు. పోలీసుల తీరును కోర్టు దృష్టికి తీసుకెళతామని, కోర్టు తీర్పు తర్వాత యాత్రను కొనసాగిస్తామని వెల్లడించారు.

కోర్టుకు సెలవుల నేపథ్యంలో మహాపాదయాత్రకు నాలుగు రోజులు నిలిపేస్తున్నట్లు అమరావతి రైతుల ఐక్య కార్యాచరణ సమితి ప్రకటించింది.డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 41వ రోజు రైతుల మహా పాదయాత్ర ప్రారంభం కావాల్సి ఉంది. రామచంద్రపురం బైపాస్ రోడ్డు సమీపంలో రైతులు బసచేసిన ఫంక్షన్ హాల్ ను పోలీసులు చుట్టుముట్టారు. రైతులను కలిసేందుకు వస్తున్న వారిని అడ్డుకున్నారు. హాల్ లోపలికి ఎవరినీ వదలలేదు. పాదయాత్రలో పాల్గొనే రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని, ఆ కార్డులు ఉన్న 600 మంది రైతులనే యాత్రలో అనుమతించాలని హైకోర్టు ఆదేశాలను పాటించాలని రైతులకు సూచించారు.

గుర్తింపు కార్డులు చూపించిన వాళ్లను మాత్రమే యాత్రలో పాల్గొనేందుకు అనుమతిస్తామని, అనుమతి లేని వాహనాలు యాత్రలో కొనసాగేందుకు ఒప్పుకోబోమని పోలీసులు తేల్చిచెప్పారు. ఈ విషయంపై రైతులు, పోలీసుల మధ్య వాగ్వాదం నెలకొంది.ఈ నేపథ్యంలో పాదయాత్రను నాలుగు రోజుల పాటు నిలిపేస్తున్నట్లు జేఏసీ నేతలు ప్రకటించారు.

యాత్రలో పాల్గొన్న మహిళా రైతులను పోలీసులు గాయపరిచారని, మహిళలను, రైతులను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. యాత్రను అడ్డుకోవాలనే లక్ష్యంతో తమకు అడుగడుగునా పోలీసులు ఆటంకాలు కలిగిస్తున్నారని మండిపడ్డారు. దీనిపై కోర్టులోనే తేల్చుకోవాలని నిర్ణయించి, యాత్రను తాత్కాలికంగా నిలిపేసినట్లు వివరించారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us